వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకోసం పోరాడుతా: జెఏసి జెండాతో హీరో సునీల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sunil
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సునీల్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని మోమిన్‌పేట నందివాగు ప్రాజెక్టు సమీపంలో దేవీ ప్రసాద్ దర్శకత్వంలో సూపర్ గూడ్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. బుధవారం తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నేతలు పలువురు సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అడ్డుకున్నారు.

సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో సినిమాల చిత్రీకరణ జరపకూడదని తెలంగాణ ఐకాస విద్యార్థులు జోరుగా నినాదాలు చేశారు. పోలీసులు, చిత్ర యూనిట్ సర్ది చెప్పినా వారు వినిపించుకోలేదు. చివరకు హీరో సునీల్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.

తాను తెలంగాణలోనే ఉంటున్నానని, రాష్ట్రం విడిపోయినా, ఒక్కటికా ఉన్నా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తాను కూడా తెలంగాణ కోసం పోరాడుతానంటూ ఐకాస జెండా పట్టుకొని తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో విద్యార్థులు శాంతించి అక్కడ నుండి వెళ్లిపోయారు.

కాగా హాస్య నటుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సునీల్ హీరోగా ఎదిగాడు. హస్య నటుడిగా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. సునీల్ హీరోగా నటించిన మూడు చిత్రాలు ఇప్పటి వరకు వచ్చాయి.

English summary

 Hero and comedian Sunil said that he is ready to fight for seperate Telangana. He was clarified his openion on Telangana when T-JAC student obstructed his cinema shooting in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X