నో డౌట్, ముమ్మాటికీ జగన్ కోవర్టే: కెవిపిపై విహెచ్ ఫైర్

తన తండ్రి హయాంలో వైయస్ జగన్ బాగా సంపాదించారని, ఈ సంపాదన వెనుక కెవిపి హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. అక్రమాలతో జగన్ ఎంత సంపాదించారో కెవిపి కూడా అంతకు తక్కువేమీ సంపాదించలేదన్నారు. వైయస్ ఫోటో లేదని వ్యాఖ్యానించడం ద్వారా కెవిపి స్వరూపం ఇప్పుడు బయట పడిందన్నారు. గాంధీ భవనంలో వైయస్ ఫోటోను కార్యకర్తలే తొలగిస్తారన్నారు. మిత్రుడి కోసం కెవిపి అనవసర తాపత్రయానికి పోతున్నారని, మొన్నటి కార్యక్రమంలో వైయస్ ప్రస్తావన అనవసరమని అన్నారు.
కెవిపి ముమ్మాటికి జగన్ కోవర్టే అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీకి నష్టం చేసే విధంగా, జగన్‌కు అనుకూలంగానూ ఉన్నాయన్నారు. కాగా రెండు రోజుల క్రితం యువజన కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో కెవిపి వైయస్ ఫోటో లేక పోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ఇప్పటికే పలువురు స్పందించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి, పిసిసి సభ్యుడు నిరంజన్, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ తదితరులు కెవిపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జగన్ కోవర్టు అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications