పెళ్లైన వ్యక్తితో వివాహం: కట్టేసి యువతిని చితకబాదారు

Karimnagar
కరీంనగర్/విజయవాడ: పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసికుంది. జిల్లాలోని ధర్మారం మండలం చామనపల్లికి చెందిన మల్లయ్యకు పదేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య కలతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భార్యకు తెలియకుండా ఇటీవల మరో యువతితో కలిసి పారిపోయాడు.

వారిద్దరు రెండో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం రాత్రి రెండవ భార్య, వారి అత్తమామలతో కలిసి మొదటి భార్య రమపై వీరు దాడికి పాల్పడ్డారు. దీంతో తనకు న్యాయం చేయాలని మొదటి భార్య రమ గ్రామ పెద్దలను ఆశ్రయించింది. రమ భర్తను మిగిలిన వారిని గ్రామ పెద్దలు పిలిపించి, రెండవ భార్యను పంపించి వేయాలని సూచించారు. వారు వినక పోవడంతో చర్యలకు ఉపక్రమించారు.

భర్త, రెండో భార్య తరఫు బంధువులు పారిపోయారు. రెండో భార్య మాత్రం వారికి దొరికిపోయింది. దీంతో ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు వచ్చి గ్రామస్థుల నుండి ఆమెను విడిపించారు. పెళ్లైన వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకోవడం పట్ల రెండో భార్య పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు విజయవాడలో ఓ నర్సు నిర్వాకం కారణంగా ఓ యువతి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంది. తెలిసీ తెలియని వైద్యంతో సదరు నర్సు ఓ యువతికి అబార్షన్ చేసింది. అయితే అది వికటించడంతో ఆ మహిళ ప్రాణాపాయ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు నర్సును, అబార్షన్ చేయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+