Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జెడి కాల్ డేటా లీక్ కేసు: సిఐడి కస్టడీలో కెవి రెడ్డి

CBI JD Lakshminarayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) కాల్ డేటా రికార్డు లీక్ కేసులో అరెస్టయిన ఇంద్ భారత్ ప్రతినిధి కెవి రెడ్డిని సిఐడి పోలీసులు శుక్రవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను సిఐడి పోలీసులు ఆయనను తమ కస్టడీలోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాదేండ్‌ పోలీసులను తప్పుదారి పట్టించి కెవి రెడ్డి ఈ కాల్ డేటా రికార్డులను సంపాదించినట్లు విచారణలో తేలింది. దీంతో కెవి రెడ్డిని సిఐడి కేసులో నిందితుడిగా చేర్చింది.

మహారాష్టక్రు చెందిన కె.వెంకట్‌రెడ్డి అలియాస్ కెవిరెడ్డిని సిఐడి అధికారులు జూలై 26వ తేదీన అరెస్టు చేశారు. మహారాష్టల్రోని ఇంద్ భరత్ ఇంజినీర్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వెంకట్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. జెడి కాల్ లిస్టును బయటకు తీయడంలో వెంకటరెడ్డి సహకరించినట్లు గుర్తించడంతో అరెస్టు చేయగా, నిందితుడిపై ఐపిసి 120 బి, 420, 166, 167, 218, 201, 500, 509, ఐటి చట్టం 2000 సెక్షన్ 43 (జి) 84 (సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా కరబ్‌ఖాండ్ గ్రామంలో ఇంద్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్ అనే సంస్థకు రఘురాజు చైర్మన్‌గా ఉన్నారు. అదే సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కెవి రెడ్డి ద్వారా జెడి కాల్ లిస్ట్‌ను సేకరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన మిక్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ ఎంవి రమణ రావు, రఘురాజు మధ్య పరిచయం ఉంది. రమణారావు ద్వారా నాగపూర్ టెలికం అధికారి అయిన హనుమంత రావును సంప్రదించి... జెడి సెల్ నంబరు సహా మొత్తం 3 సెల్‌ఫోన్ల నంబర్ల కాల్‌డేటా కావాలని అడిగారు.

ఈ క్రమంలో.. విజయవాడ బిఎస్ఎన్ఎల్ ఐటీఎస్ డైరెక్టర్ రామకృష్ణ నుంచి జెడి కాల్ డేటా కోసం అబిడ్స్‌లోని భారత్ సంచార్ భవన్ (టెలికం ఆఫీస్)లో అదనపు జనరల్ మేనేజరు (ఆపరేషన్స్) రవిచంద్రకు ఈ-మెయిల్ వెళ్లింది. రామకృష్ణ తమ శాఖ అధికారే కావడంతో... రవిచంద్ర జెడి కాల్ డేటా ఇచ్చారు. తర్వాత.. ఆ లిస్ట్ బిఎస్ఎన్ఎల్ నోడల్ అధికారి(హైదరాబాద్) బాల్‌సింగ్ వద్దకు చేరింది.

ఆ లిస్ట్ తీసుకుని పంపాలని నాగ్‌పూర్ బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారి కె.హనుమంత రావు తనకు ఎస్ఎంఎస్ చేసినట్లు రామకృష్ణ సిఐడి అధికారులకు తెలిపారు. ఆయన ఆ లిస్ట్‌ను హనుమంత రావుకు అందించారు. అదే జాబితా హనుమంతరావు ద్వారా కెవి రెడ్డికి, అక్కడి నుంచి రఘురాజుకు అందింది. దీని ఆధారంగానే జెడిపై రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.ఆ తర్వాత జగన్ మీడియా ద్వారా కాల్‌లిస్ట్‌ను కూడా బయటపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+