• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రహస్యంగా పెళ్లి చేసుకున్న సినీ హీరో తారకరత్న

By Pratap
|

Tarakaratna
హైదరాబాద్: నందమూరి హీరో తారకరత్న రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. శుక్రవారం రాత్రి ఈ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆయన గురువారం రాత్రి 10 గంటల 31 నివాసాలకు హైదరాబాదు సమీపంలోని సంఘీ టెంపుల్‌లో కొద్ది మంది మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు ఆ వార్తల సారాంశం. కుటుంబ పెద్దలు వ్యతిరేకించడం వల్లనే తారకరత్న రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆ వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.

టీవీ చానెళ్లలో ప్రసారమైన వార్తాకథనాల ప్రకారం - తారకరత్న తెలుగుదేశం మహిళా నాయకురాలి మేనకోడలిని వివాహమాడారు. ఈ వివాహాన్ని రహస్యంగా ఉంచారు. ఈ నెల 10వ తేదీన రిసెప్షన్ జరుగుతుందని, ఆ సమయంలో అన్ని విషయాలు వెల్లడిస్తారని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాచారం ఇస్తారని తారకరత్న మిత్రులు చెబుతున్నారు.

తారకరత్న వివాహం చేసుకున్నట్లు ధృవీకరించుకున్న తర్వాతనే తాము వార్తాకథనాన్ని ప్రసారం చేస్తున్నట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ చెప్పుకుంది. తారకరత్న వివాహానికి హాజరైన ఆయన మిత్రులను, తారకరత్న కుటుంబ సభ్యులను కూడా తాము సంప్రదించామని ఆ టీవీ చానెల్ చెప్పుకుంది. అయితే, ఎవరు కూడా వివరాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని, మిత్రులు మాత్రం వివాహం చేసుకున్న మాట నిజమేనని చెప్పారని, ఈ నెల 10వ తేదీన రిసెప్షన్ జరుగుతుందని, అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారని వారు చెప్పినట్లు ఆ చానెల్ వివరించింది.

తారకరత్న పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అలేఖ్య అని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెల్లడించింది. ఆమె తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసినట్లు స్క్ర్రోలింగ్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో తెలుగు హీరోలు ప్రేమలో పడుతున్న విషయం సర్వసాధారణంగానే మారింది. అయితే వారంతా కుటుంబ పెద్దలను ఒప్పించి తాము ప్రేమించినవారిని పెళ్లి చేసుకుంటున్నారు. తారకరత్న విషయంలో మాత్రం పెళ్లి గోప్యంగా జరిగిపోయింది. తారకరత్న పలు సినిమాల్లో హీరోగా నటించారు. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to news channels reports - Nandamuri hero Tarakaratna has married a Telugudesam woman leader's relative secretly. Tarakaratna has acted in several Telugu films as a hero.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more