చిరంజీవి సిఎం కారు, కెసిఆర్ ఎన్ని చెప్పినా: లగడపాటి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెప్టెంబర్‌లోగా తెలంగాణ వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన చెప్పిన సెప్టెంబర్ నెలలు ఎన్నో వచ్చాయి, వెళ్లాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజలను అనవసరంగా తెరాస నేతలు రెచ్చ గొట్టవద్దని సూచించారు.
విభజన అవసరం లేదని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. తెలంగాణపై కేంద్రం హామీ ఇస్తే కెసిఆర్ ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేస్తారా అని సవాల్ విసిరారు. కేంద్రం నుండి సంకేతాలు ఉన్నాయన్న కెసిఆర్ అలాంటప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికలలో యుపిఏ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయరని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications