మాజీ డిప్యూటీ సిఎం వదిలేశాడు, ఆమె ఆత్మహత్య

Ex-Haryana Dpty CM's estranged wife found dead
మొహాలీ: హర్యానా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి చందర్ మోహన్ భార్య ఫిజా ఆకా అనురాధా బాలి చండీఘర్‌లో శవమై తేలింది. మొహాలీలోని నివాసంలో ఆమె శవం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె చందర్ మోహన్ రెండో భార్య. చండీఘర్ శివారులోని పంచుకల 48 సెక్టార్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన ఆమె బంధువు శవాన్ని చూశాడు.

ఆమె మరణించి రెండు, మూడు రోజులు గడిచి ఉండవచ్చునని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్ నోట్ ఏదీ సంఘటనా స్థలంలో కనిపించలేదు. హర్యానా మాజీ అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ ఫిజా శవం కళ్లిపోయిన దశలో ఆమె నివాసంలో కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

చందర్ మోహన్ కొంత కాలం క్రితం ఆమెను వదిలేసి మొదటి భార్య వద్దకు వెళ్లిపోయారు. అప్పట్లో వారిద్దరి వివాహం తీవ్ర సంచలనం సృష్టించింది. మీడియా ఈ సంఘటనకు ఎక్కడ లేని ప్రచారం కల్పించింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు చందర్ మోహన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఉన్నతమైన పదవిని వదిలేశారు.

ఆమె 2009 జనవరి 30వ తేదీన ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అయితే, తృటిలో తప్పించుకుంది. 2008లో ఆమెను చందర్ మోహన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2009లో వదిలేసి మొదటి భార్య వద్దకు వెళ్లిపోయారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులున్నారు. తలాఖ్ అంటూ మూడుసార్లు ఎస్ఎంఎస్ మెసేజ్‌ను ఫిజాకు పంపేసి చందర్ మోహన్ తప్పుకున్నారు. భజన్ లాల్ కుటుంబం తనను వేధిస్తోందంటూ ఫిజా పలుసార్లు ఫిర్యాదు చేసింది. చందర్ మోహన్ వదిలేసినప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+