వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డి లాబీయింగ్: జైపాల్ రెడ్డి మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-S Jaipal Reddy
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్ మళ్లింపుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాబీయింగ్ చేస్తుండగా, మళ్లింపుపై విమర్శలు చేస్తున్నవారిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గ్యాస్, విద్యుత్తులపై విషయ పరిజ్ఞానం లేనివారు స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని జైపాల్ రెడ్డ్ి అన్నారు. గత 11 నెలలుగా చమురు రంగంలో సంక్షోభం నెలకొన్నా మన రాష్ట్రానికి గ్యాస్ సరఫరా చేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదని ఆయన సోమవారంనాడు అన్నారు.

ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల కేటాయంపు ప్రాధాన్యతను గుర్తించారనిన, ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి తగిన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. నిరంతరం గ్యాస్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల లాభం చేకూరిందని ఆయన చెప్పారు. గ్యాస్ కొరతకు తనను మాత్రమే నిందించడం తగదని ఆయన అన్నారు. రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపులపై మంత్రులు సాధికారిక బృందమే తిరిగి సమీక్షించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మాట్లాడుతానని ఆయన చెప్పారు.

గ్యాస్ కోసం లాబీయింగ్ చేయడం కోసం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి అదనపు గ్యాస్, విద్యుత్తు కేటాయించాలని ఆయన మొయిలీని కోరారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు పార్లమెంటు సభ్యులు, మంత్రులు పాల్గొన్నారు.

గ్యాస్ కొరత అంశాన్ని ముఖ్యమంత్రి తమ దృష్టికి తీసుకుని వచ్చారని మొయిలీ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీనిపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తున్నారని ఆయన చెప్పారు.

సుశీల్ కుమార్ షిండే విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మహారాష్ట్రకు మేలు చేసేందుకు కెజి బేసిన్ గ్యాస్‌ను రత్నగిరి ప్లాంటుకు కేటాయించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందనే విమర్సలు వస్తున్నాయి. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ కూడా రాశారు.

English summary
Union Minister S Jaipal Reddy expressed anguish at the critics on gas shortage to Andhra Pradesh. Meanwhile, CM Kiran Kumar Reddy is lobbying for gas allocation to AP. He meet union power minister Veerappa Moily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X