• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధాని పదవిపై అద్వానీ సంచలనం, మోడీకి నితీష్ నో

By Srinivas
|

LK Advani - Nitish Kumar
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోకసభ ఎన్నికలలో కాంగ్రెసు, బిజెపియేతర వ్యక్తి ప్రధాని అవుతారని అన్నారు. అయితే ఈ రెండు పక్షాలలో ఒకరి మద్దతు మాత్రం తప్పనిసరి అన్నారు. వచ్చే లోకసభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి ఘోర పరాజయం తప్పదన్నారు. ఆ పార్టీ సాధించే స్థానాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెసు గెలుచుకునే స్థానాల సంఖ్య 100లోపే ఉంటుందన్నారు.

కేంద్రంలో కాంగ్రెసు, బిజెపియేతర వ్యక్తి నేతృత్వంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడినా ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పక్షం మద్దతు తప్పనిసరి అన్నారు. అయితే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో మనజాలదన్నారు. అద్వానీ తాజాగా తన బ్లాగ్‌లో జాతీయ రాజకీయ భవిష్యత్ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. మరోవైపు ప్రధానమంత్రి రేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లేనిపక్షంలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీయేకు మద్దతు ఇస్తుందని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్.. బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి తేల్చి చెప్పారు.

అయితే ఎన్డీయే కూటమిలో ముసురుకుంటున్న ప్రధానమంత్రి వివాదం ఎటు దారి తీస్తుందోనననే ఆసక్తి రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్టీయే తరఫున నరేంద్ర మోడీ పేరును ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించబోమని హామీ ఇవ్వాలని బిజెపిని జెడియూ గట్టిగా కోరింది. ఆ షరతుపై మాత్రమే తాము 2014 ఎన్నికల్లో బిజెపితో కలిసి పని చేయగలమని బీహార్ సిఎం నితీశ్‌ కుమార్ స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా గడ్కరీకి చెప్పినట్టు నితీశ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కథనం ప్రకారం, ఇటీవల రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వారిద్దరు కలుసుకొన్నారు. ఈ సమయంలో నితీశ్‌ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం గురించి ప్రస్తావించారు. ఇంకా సంవత్సరన్నర కాలం ఉన్నందున, తమ పార్టీలో అటువంటి చర్చ ఏదీ జరగడం లేదని నితిన్ ఆయనకు వివరించారు. అయితే, ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెడితే బాగుంటుందని నితీశ్ సూచించారు. ఐతే, ఆ అభ్యర్థి మోడీ కాకూడదని గట్టి షరతు విధించారు.

అద్వానీ బ్లాగ్ వ్యాఖ్యల ద్వారా.. బలమైన నేతగా ఎదిగినా.. ప్రధానమంత్రి పదవికి పోటీపడటం, పీఠం దక్కించుకోవడం మోడీకి ఇప్పట్లో సాధ్యం కాదనే సంకేతాలను అద్వానీ పరోక్షంగానైనా ఇచ్చినట్టయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Veteran leader of Bharatiya Janata Party (BJP), LK Advani claimed that a third font without the support of Congress or BJP can not form the government in India and if such occasion arrives, then the government can not last long.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more