విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ అరెస్ట్, రిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kola Krishna Mohan
విజయవాడ: యూరో లాటరీ కేసు నిందితుడు కోలా కృష్ణ మోహన్‌ను కృష్ణా జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. యూరో లాటరీ కేసుతో పాటు పలు ఛీటింగ్ కేసులు, బ్యాంకును మోసగించిన కేసులలో కోలా ఆరోపణలెదుర్కొంటున్నాడు. అతనిని సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కృష్ణ మోహన్‌ను కోర్టులో హాజరుపర్చగా ఎనిమిదవ ఫాస్టు ట్రాకు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

తిరిగి ఎనిమిదవ తేదీన కోర్టులో హాజరు పర్చాల్సిందిగా న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. దీంతో కోలాను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. పటమట, గవర్నరుపేట తదితర ప్రాంతాలలో బ్యాంకులకు చెల్లని చెక్కులు ఇచ్చి కోలా కృష్ణమోహన్ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోర్టులో కేసులు వేయగా కోలా కృష్ణ మోహన్‌కు కింది కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. నిందితుడు పైకోర్టులో అప్పీలు చేసుకోగా అది ఎనిమిదవ ఫాస్టు ట్రాక్ కోర్టులో పెండింగ్‌లో వుంది.

అయితే 2009 నుంచి నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మరోవైపు కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా ఓ టివి ఛానల్‌లో ప్రత్యక్షమై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చానంటూ ప్రచారం చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై మూడేళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న కోలా కృష్ణ మోహన్ ఆచూకీ కనిపెట్టేందుకు తమ ప్రయత్నాలు ప్రారంభించారు.

వరుసగా నిఘా పెట్టి ఎట్టకేలకు హైదరాబాద్‌లో ఆదివారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అనంతరం విజయవాడలోని ఎనిమిదవ ఫాస్టుట్రాక్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బుధవారం అప్పీలు కేసులకు సంబంధించి వాయిదాలు వున్న నేపథ్యంలో ఆ రోజున కోర్టుకు నిందితుడిని తీసుకురావాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.

English summary
Euro lottery case main accused Kola Krishna Mohan was arrested by Suryaraopeta police on Sunday evening. Police attended him before court on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X