కిరణ్‌కు చెప్పింది నేనే, అలాంటివి పట్టించుకోను: జైపాల్

Jaipal Reddy
న్యూఢిల్లీ: గ్యాస్ కేటాయింపులో ఆంధ్ర ప్రదేశ్‌కు నష్టం జరగకుండా ఉండేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించింది తానేనని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి మంగళవారం అన్నారు. గ్యాస్ కేటాయింపులలో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డి పెదవి విప్పక పోవడంపై పలువురు విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన స్పందించారు.

గ్యాస్ కేటాయింపులలో రాష్ట్రానికి త్వరలో ఊరట లభిస్తుందన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా తాను నిమిత్తమాత్రుడినేనని, అయితే రాష్ట్ర నేతగా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రధానిని కలవాలని కిరణ్‌కు సూచించింది తానే అన్నారు. మూడు రోజుల క్రితం సిఎం ఫోన్ చేసినప్పుడు ప్రధానిని కలిస్తే మేలు జరుగుతుందని సూచించానని చెప్పారు. తీవ్ర విద్యుత్ కొరత ఉన్నందువల్ల ఎపిని కేంద్రం అదుకుంటుందన్నారు.

కెజి బేసిన్‌లో ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ సమస్య వస్తోందన్నారు. ఎపి పట్ల తాను ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. సహచర మంత్రులు అందరితోనూ ఈ సమస్యపై సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. సహచర ఎంపీలు విమర్శించడాన్ని తాను పట్టించుకోనన్నారు. కొందరు తెలియకుండా ఏదో మాట్లాడేస్తుంటారన్నారు. అదనపు విద్యుత్‌ను రాష్ట్రానికి ఇవ్వడమా లేక గ్యాస్ కోతను పునరుద్ధరించడమా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+