వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ, భార్య, లేడీ డాక్టర్ అరెస్టు: మందు కొట్టి దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Karnataka
బెంగళూరు: బహిరంగంగా మద్యం సేవించి, ఓ మహిళా పోలీసు అధికారిపై దాడి చేసినందుకు పోలీసులు ఓ టెక్కీని, అతని భార్యను, లేడీ డాక్టర్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున బెంగళూర్‌లోని ప్యాలెస్ రోడ్డులో గల మౌంట్ కార్మెల్ కళాశాల వద్ద జరిగింది. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు తెల్లవారు జామున 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో మద్యం సేవించి గొడవ చేయడం ప్రారంభించారని డిసిపి బిఆర్ రవికాంతే ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో చెప్పారు

బీరు, వోడ్కా సీసాలు ప్రెస్ స్టిక్కర్ అతికించిన కారు బాయినెట్ మీద పెట్టుకుని అల్లరి ప్రారంభించారని చెప్పారు. చీతా బైక్‌పై గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ వారిని చూసి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారని, అయితే ఆ కానిస్టేబుల్‌ను వారు దుర్భాషలాడారని ఆయన చెప్పారు. దీంతో పై అధికారి, సబ్ ఇన్‌స్పెక్టర్ శోభకు ఫోన్‌లో కానిస్టేబుల్ విషయం చెప్పాడు.

దాంతో శోభ అక్కడికి చేరుకున్నారు. ఆమెను కూడా ఆ మూక దుర్భాషలాడింది. ఓ మహిళ ఆమెను పట్టుకుని అరవడం ప్రారంభించగా, మరో మహిళ వెక్కిరంచడం మొదలు పెట్టిందని, కొట్టింది కూడా అని పోలీసులు తెలిపారు. అల్లరి మూకల్లో ఒకరిని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ పురాణిక్‌గా గుర్తించారు. ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకుని హై గ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌కు తరలించి వైద్య పరీక్షలకు పంపించారు.

ఆరుగురిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సతీష్ పురాణిక్‌తో పాటు అతని వందనను, డాక్టర్ పజక మహేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి ఆగస్టు 22వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.

English summary
A techie, his wife and a woman doctor were arrested for attacking a woman police officer, who questioned them after they were found drinking in the open. This happened near Mount Carmel College on Palace Road in the wee hours of Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X