వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనితా అద్వానీ రాజేష్ ఖన్నా లవర్ కాదు: ఫ్యామిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajesh Khanna
ముంబై: అనితా అద్వానీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ప్రియురాలు, సహజీవనం చేసిన మిత్రురాలు గానీ కాదని ఆయు కుటుంబ సభ్యులు అంటున్నారు. రాజేష్ ఖన్నా మరణించిన మూడు వారాల తర్వాత కుటుంబం అనితా అద్వానీ వాదనను ఖండిస్తూ బయటకు వచ్చింది. తన తండ్రి ఆస్తిలో వాటా కోరే చట్టబద్దమైన హక్కు అనితా అద్వానీకి లేదని రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ తన న్యాయవాది భేరు చౌదరి ద్వారా పంపిన నాలుగు పేజీల లేఖలో స్పష్టం చేశారు.

మరణానికి ఒక రోజు ముందు జులై 18వ తేదీన రాజేష్ ఖన్నాకు తన న్యాయవాది మృదులా కదం ద్వారా అనితా అద్వానీ లీగల్ నోటీసు జారీ చేశారు. దానికి సమాధానంగా ట్వింకిల్ తమ న్యాయవాది ద్వారా సమాధానం పంపించారు. ఈ విషయంపై చౌదరీ గానీ కదం గానీ మాట్లాడడానికి ఇష్టపడలేదు.

తాను పిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి చెందినదాన్నని, బాలీవుడ్‌లో నిర్మాతగా అడుగు పెట్టడానికి ప్రయత్నించానని అద్వానీ గతంలో చెప్పారు. తనకు ఇప్పుడు 50 ఏళ్లని, తనకు మరొకరి సహాయం అవసరమైన సమయంలో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆమె ఆరోపించారు.

బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఇంటి నుంచి తనను బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అనితా అద్వానీ గృహ హింస నిరోధక చట్టం కింద తన హక్కును డిమాండ్ చేశారు. రాజేష్ ఖన్నా అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల తీరు తనను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆమె ఆరోపించారు.

రాజేష్ ఖన్నా జీవితంలో అనితా అద్వానీ భాగస్వామి అని కుటుంబం ఏ రోజు కూడా గుర్తించలేదని, అందువల్ల ఆమెకు ఆస్తిని అడిగే హక్కుల లేదని ట్వింకిల్ పంపిన సమాధానంలో చెప్పారు. రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియాకు అసలు విడాకులే ఇవ్వలేదు.

English summary
Three weeks after superstar Rajesh Khanna died, his family has denied Anita Advani's claims that she was his long-time live-in partner and lover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X