అది సినిమా కాదు: జయాబచ్చన్‌పై షిండే వ్యాఖ్య

Sushilkumar Shinde
న్యూఢిల్లీ: సినీనటి, పార్లమెంటు సభ్యురాలు జయబచ్చన్‌పై గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెనక్కి తీసుకోవాల్సి రావడమే కాకుండా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. షిండే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అస్సాం హింసపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు ఆయన సమాధానమిస్తూ జయాబచ్చన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ సినిమా సినీ నటి అయిన జయాబచ్చన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జయా బచ్చన్ మాట్లాడుతున్నప్పుడు జోక్యం చేసుకుని - ఇది తీవ్రమైన విషయమని, సినిమా ఇతివృత్తం కాదని షిండే వ్యాఖ్యానించారు. దానికి జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆమెతో ఇతర సభ్యులు గొంతు కలిపారు.

జయా బచ్చన్ విశిష్టమైన సెలిబ్రిటీ, ఈ సభ సభ్యురాలని ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ అంటూ భారత హోం మంత్రిగా ఆమెపై ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే సభ నడుస్తుందని ఆయన అన్నారు. అయితే, షిండే తొలుత అందుకు నిరాకరిస్తూ - హోం మంత్రి మాట్లాడుతున్నప్పుడు జయాబచ్చన్ జోక్యం చేసుకోవడం సరి కాదని షిండే అన్నారు.

వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకోకపోతే రికార్డుల నుంచి తొలగిస్తామని అధ్యక్ష స్థానంలో ఉన్న తారిక్ అన్వర్ చెప్పారు. తన వ్యాఖ్యలకు జయబచ్చన్ బాధపడితే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని, క్షమాపణ చెబుతున్నానని, ఆమె తన సోదరి అని షిండే అన్నారు. బచ్చన్ కుటుంబ సభ్యులంతా తనకు తెలుసునని, వారి పట్ల తనకు విశేషమైన గౌరవం ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య షిండే అర్థాంతరంగా తన సమాధానాన్ని ఆపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+