వైయస్ స్కీమ్: చంద్రబాబుకు జగన్ పార్టీ నేత కితాబు!

ఈ పథకాన్ని వైయస్ పేద విద్యార్థులు బాగా చదువుకోవాలని ప్రవేశ పెట్టారన్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దానిని నీరిగారుస్తోందని మండిపడ్డారు. ఫీజుల పథకాన్ని తానే ప్రారంభించానని చంద్రబాబు చెప్పుకోవడం కన్నా పచ్చి అబద్దం మరొకటి ఉండదన్నారు. వాన్ పిక్ కేటాయింపుల పైన ఆమె చంద్రబాబుపై మండిపడ్డారు. కేటాయించిన భూముల్లో పాదయాత్ర చేస్తున్న బాబు అసలు భూకేటాయింపులపై ఆయన విధానం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
వైయస్ హయాంలో వాన్ పిక్ ఒప్పందం జరిగింది కాబట్టి అది తప్పని బాబు ఊరేగటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైయస్ పాలనలో పరిశ్రమలకు, సెజ్‌లకు, ప్రాజెక్టులకు చేసిన భూకేటాయింపులు తప్పని బాబు చెప్పదల్చుకుంటే తన పాలనలో చేసిన భూకేటాయింపుల పైన కూడా జవాబు చెప్పాలని, అసలు పరిశ్రమలకు భూములు ఇచ్చే విషయంలో ఆయన విధానం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
బాబు తన హయాంలో రూ.1.60 లక్షల కోట్ల విలు చేసే బూములను పరిశ్రమలకు కేటాయించారని, కొన్ని భూములు అత్యంత చవక లీజుకు ఇచ్చారని, వీటన్నింటి పైనా బాబు సమాధానం చెప్పాలన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట ప్రతిపక్షంలో మరో మాట చెబుతున్నారని, తాను చేస్తే ఒప్పు, వైయస్ చేస్తే తప్పు అన్న విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.