రాజమౌళిని పిచ్చిపిచ్చిగా తిట్టిపోస్తున్న హైదరాబాద్ వాసులు.. కారణం అదే !!

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమా విషయంలో చాలా కఠినంగా ఉంటారని అందరికీ తెలిసిందే. పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేకులైనా తీసుకునే ఆయన.. శిల్పాన్ని చెక్కినట్టే సినిమాను చెక్కుతారని 'జక్కన్న' అని పిలుచుకుంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఆయన తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా కారణంగా హైదరాబాద్ నగర వాసులు ఆయనను తిట్టిపోస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో నివసించే వారికి సమ్మర్ లో వచ్చే నీటి కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భానుడి భగభగలతో ప్రజలు బయటికి రావలంటేనే భయపడుతున్నారు. నగరంలో అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు రోజువారీ అవసరాలకు కూడా ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లోనే వారణాసి మూవీ షూటింగ్ కోసం 10 వేల లీటర్ల సామర్థ్యమున్న 150 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయాలని Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWS&SB)ను అభ్యర్థించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

director-rajamouli-facing-heavy-trolls-due-to-using-thousands-of-liters-water-for-varanasi-movie-sho

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసరాల్లోని గగన్‌పహాడ్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా, ప్రత్యేకంగా నీటి సన్నివేశాల కోసం ఒక పెద్ద కుంటను నిర్మించినట్లు సమాచారం.

అయితే ఈ సన్నివేశాల కోసం ఒక్కోటి 10 వేల లీటర్ల సామర్థ్యమున్న 150 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయాలని నిర్మాతలు HMWS&SBను అభ్యర్థించారు. రవాణా ఖర్చులు కూడా తామే భరిస్తామని పేర్కొన్నారు. కానీ నగరంలో ఇప్పటికే నీటి సంక్షోభం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. భారీ స్థాయిలో నీటిని కేటాయించడం సాధ్యం కాదని వాటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ప్రజల తాగునీటి అవసరాలే ప్రాధాన్యత అని చెప్పి ఈ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలుస్తోంది.

దీంతో మూవీ షూటింగ్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూనిట్ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలానే ఈ ఘటన సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు "ప్రజలకు తాగునీరు దొరకడం లేదు... సినిమా కోసం 150 ట్యాంకర్లా?" అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రాజమౌళిపై నేరుగా ట్రోల్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+