రౌడీ హోం మంత్రికి తమ్ముడా: దానంపై నారాయణ

K Narayana
హైదరాబాద్: వీధి రౌడీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తమ్ముడా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను సబితా ఇంద్రారెడ్డికి తమ్ముడి లాంటివాడినని దానం నాగేందర్ చేసిన ప్రకటనపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. మంత్రియా, వీధి రౌడీయా అని ఆయన దానం నాగేందర్‌పై విరుచుకుపడ్డారు. దానం నాగేందర్ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు.

సమస్య ఉంటే మంత్రివర్గంలో చర్చించాలి గానీ దేవాలయాలకు తాళం వేయడం ఏమిటని ఆయన దానం నాగేందర్ తీరుపై ప్రశ్నించారు. కేసుల్లో ఉన్న మంత్రులందరినీ మంత్రి వర్గం నుంచి తప్పించాలని, అప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గౌరవరం పెరుగుతుందని ఆయన అన్నారు. రౌడీయో, మంత్రో దానం నాగేందర్ తేల్చుకోవాలని, లేకుంటే రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపునకు సంబంధించి పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు సంపదతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని ఆయన అన్నారు. రైతులకు వాణిజ్య పంటలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

ఇస్తాన్ ఆలయం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా ప్రతిస్పందించారని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ఆలయం వద్ద తనకు సెంటు భూమి కూడా లేదని ఆయన చెప్పారు. భూముల కోసమే తాను ఆందోళనకు దిగానని చెప్పడంలో నిజం లేదని ఆయన అన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో తనకు విభేదాలు లేవని, తాను సబితా ఇంద్రారెడ్డికి తమ్ముడిలాంటివాడినని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన శుక్రవారం సాయంత్రం కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+