రాహుల్‌ను ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తున్నా: ప్రధాని

తాను పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పెద్ద పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని, తాను ఏ విధమైన పాత్ర నిర్వహించాలనేది పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ గత నెలలో అన్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందా అని అడిగితే - ఒకవేళ ఉంటే మీడియాకు తాను చెప్తానని ఆయన అన్నారు.
సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టడంతో ఖాళీ అయిన ఆ పదవిని రాహుల్ గాంధీకి ఇవ్వాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కొంత మంది సోనియా గాంధీని కోరారు. అయితే, ఆ పదవిని హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చారు. ప్రణబ్ నిర్వహించిన ఆర్థిక శాఖను పి. చిదంబరానికి అప్పగించారు.
కాగా, వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని అంటున్నారు. ఈ పునర్వ్యస్థీకరణలో రాహుల్ గాంధీకి మంత్రి పదవి ఇవ్వవచ్చుననే ప్రచారం సాగుతోంది. అయితే, అనుభవం లేని రాహుల్ గాంధీని మంత్రివర్గంలోకి ఎలా తీసుకోవాలనేది సంశయంగా ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications