పదవి కోసమేనా?: బాబుతో బాలకృష్ణ సమాలోచనలు

బాలకృష్ణకు ఇచ్చే పదవి విషయమై, పార్టీని బలోపేతం చేసే అంశంపై వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణకు పార్టీలో ఏ పదవి ఇవ్వాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని, ప్రధాన కార్యదర్శి పదవా లేక ఏదైనా పదవి సృష్టించాలా అనే విషయమై కూడా చర్చించినట్లుగా సమాచారం. తాజా రాజకీయల విషయానికి వస్తే ఇటీవల జరిగిన బిసి డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయని తెలుస్తోంది.
కాగా ఇటీవల బాలకృష్ణ తాను రాజకీయాలలోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాలలో చెప్పారు కూడా. 2014లోగా ఆయన రాజకీయ ఆరంగేట్రం చేసి ఆ సాధారణ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపై ఇటీవల రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications