దౌర్జన్యం కేసులో టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్ అరెస్ట్

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్‌కు తరలించనివ్వమని, అక్రమ అరెస్టు అంటూ వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టిన పోలీసులు సాయి రాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.
పోలీసులు ఎమ్మెల్యేను దౌర్జన్యం కేసులో అరెస్టు చేశారు. 2010 ఏప్రిల్ నెలలో జరిగిన థర్మల్ వ్యతిరేక ఆందోళనలో సాయిరాజ్ పాల్గొన్నారు. ఆ సమయంలో అతను థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వేసిన టెంట్‌ను ఎమ్మెల్యే కూల్చారు. దీనిపై పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications