బాబా రామ్‌దేవ్ చలో పార్లమెంటు: తోడుగా గడ్కరీ

Baba Ramdev
న్యూఢిల్లీ: నల్లధనంపై దీక్ష చేస్తున్న యోగాగురు బాబా రామ్‌దేవ్ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు. నల్లధనానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని ఆయన సోమవారం ఉదయం తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. మూగ, చెవిటి ప్రభుత్వాన్ని కదిలించేదందుకు పార్లమెంటుకు మార్చ్ చేద్దామని ఆయన చెప్పారు. రామ్‌దేవ్‌కు బిజెపి జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ మద్దతు ఇస్తున్నారు. ర్యాలీలో ఆయన కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. గడ్కరి రామ్‌దేవ్ దీక్ష చేస్తున్న రామ్‌లీలా మైదానికి చేరుకుని అక్కడి నుంచి పార్లమెంటు వైపు సాగే ఊరేగింపులో పాల్గొంటారు.

కాంగ్రెసు ప్రభుత్వాన్ని బహిష్కరించాలని, వచ్చే ఎన్నికల్లో కాంగర్ెసు పార్టీకి ఓటు వేయవద్దని ఆయన సూచించారు. పార్లమెంటు మార్చ్‌కు రామ్‌దేవ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. రామ్‌దేవ్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. జైలో భరోకు సిద్ధంగా ఉండాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు.

కొంత దూరం వరకు రామ్‌దేవ్ మార్చ్‌ను సాగనిచ్చి పోలీసులు అరెస్టు చేస్తారని అంటున్నారు. నల్లధనంపై పోరాటం విషయంలో రామ్‌దేవ్ తన భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి ఓ ప్రకటన చేయవచ్చునని అంటున్నారు. పోలీసులు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ తాము తీసుకోబోయే చర్యలకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద యెత్తున బలగాలు మోహరించాయి. జైలులో రామ్‌దేవ్ తన దీక్షను విరమించే అవకాశాలున్నాయి. తదుపరి మహా విప్లవం కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని రామ్‌దేవ్ తన మద్దతుదారులకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+