రూ.35 వేలే: ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపుపై కిరణ్

కనీసం 38 వేల రూపాయలు ఇవ్వాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి. అయితే అందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించడం లేదు. వచ్చే ఏడాది ఫీజు పెంపును కూడా ఇప్పుడు ప్రకటించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అప్పుడే చూద్దామని ముఖ్యమంత్రి సూచించారు. 35వేల రూపాయల ఫీజును ఏడాదికే పరిమితం చేయాలని కాలేజీ యాజమాన్యాలు చెప్పిన మాటను కూడా ఆయన వినడం లేదు.
ఫీజు ఖరారుపై యాజమాన్యాలకు తెలియజేసి ఈ నెల 16వ తేదీ నుంచి టాస్క్‌ఫోర్స్‌తో తనిఖీలు చేయించాలని కూడా ముఖ్యమంత్రి మంత్రుల బృందానికి సూచించారు. ఒప్పందంపై కాలేజీ యాజమాన్యాల సంతకాలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రుల కమిటీ ఈ నెల 16వతేదీన సమావేశమైన తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఇదిలావుంటే, ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఏకీకృత ఫీజుల నిర్ణయంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను నిలిపేయాలంటూ కాలేజీ యాజమాన్యాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏకీకృత ఫీజులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో జాప్యంపై కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నాయి. కొన్ని యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇతర కాలేజీల యాజమాన్యాలు నివారించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు ఫీజులను ఖరారు చేయాలని, కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలని కోరుతూ మంగళవారం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.












Click it and Unblock the Notifications