గీతిక ఆత్మహత్య: మారువేషాల్లో మాజీ మంత్రి కందా

Gopal Kanda
చండీఘర్: ఎయిర్ హోస్టేస్ గీతిక ఆత్మహత్య కేసులో ఇరుక్కున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన మారువేషాల్లో చండీఘర్ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాధువు, సిక్కు వేషాల్లో అతను పట్టుబడకుండా సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. పొరుగు దేశంలోకి అతను పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయాల్లో గీతికా శర్మను ఆమెకు తెలియకుండా సిక్కు వేషంలో అనుసరించేవాడట. మరో వ్యక్తితో ఆమెకు సంబంధాలుండవచ్చుననే అనుమానంతో ఆయన అలా చేసేవారని వార్తలు వస్తున్నాయి. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఇప్పుడు అదే చిట్కాను ప్రయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన కందా తన సెల్‌ఫోన్‌ను ఆపు చేశాడు.

కందా కొంత మంది వార్తాహరులను కూడా నియమించుకుని స్థలాలు మారుస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. ఆ రకంగా అతను తన రహస్య స్థావరాలను మారుస్తున్నట్లు అనుమానిస్తున్నారు. తన సొంత పట్టణం సిర్సాలో అతను ఉండడం లేదని అంటున్నారు. సిర్సాలోని ఆయన నివాసం వెలవెలబోతోంది. గీతికా శర్మ ఆత్మహత్య తర్వాత కందా ఇంటికే రాలేదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు.

కందా అజ్ఞాతంలోకి వెళ్లి గీతికతో తనకు గల సంబంధాలపై ఉన్న ప్రతి సాక్ష్యాన్ని తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గీతిక ఇ- మెయిల్ పాస్‌వర్డ్‌ను పోలీసులు ఇప్పటి వరకు సంపాదించలేకపోయారు. కాల్ రికార్డులను మాత్రం పొందారు. కందా గీతికకు పంపిన 400 పేజీల టెక్స్ట్ మెసేజ్‌ను వారు పరిశీలిస్తున్నారు. కందా ఇల్లు, ఫామ్‌హౌస్, కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు మాయమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+