అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థి కాల్చివేత

కాగా, హరినాధ్ మృతి చెందినట్లు హైదరాబాద్‌లో ఉంటున్న అతడి తమ్ముడు శశికి మంగళవారం ఉదయం సమాచారం అందింది. హరినాధ్ బెల్లంపల్లి పట్టణంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు, ఒంగోలులో ఇంటర్, కాకతీయ వర్సిటీలో ఎంఫార్మసీ పూర్తి చేశారు. తర్వాత క్యాన్సర్ వ్యాధిపై పరిశోధనల కోసం టెక్సాస్ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో చేరారు.
హరినాథ్ 2009 ఆగస్టులో అమెరికా వెళ్లాడు. టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయం హెల్త్ సైన్సెస్ సెంటర్‌లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. డబ్బులు అడిగి తీసుకుని ఆ తర్వాత దుండగులు హరినాథ్‌ను కాల్పి చంపి పరారైనట్లు చెబుతున్నారు. హరినాథ్ తండ్రి రమేష్ బెల్లంపల్లిలోని కాల్టెక్స్ ఏరియాలో పాన్ షాపు నడుపుతున్నాడు.
కుమారుడి మరణం గురించి విన్న వెంటనే తల్లి పద్మ కుప్పకూలిపోయింది. యాంటీ క్యాన్సర్ థెరపీపై హరినాథ్‌తో పాటు డాక్టర్ కల్కుంటే శ్రీవేణుగోపాల్ సీరియస్‌గా పరిశోధన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications