బాబును కలిసిన బాలకృష్ణ, ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో..!

తెలంగాణపై టిడిపి ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని, కేంద్రానికి కూడా లేఖ రాసిందని, అవసరమైతే మరోసారి కూడా లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నామని బాలయ్య చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. తెలుగుదేశం పార్టీలో కూడా బాలయ్య వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య బాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు చంద్రబాబు కూడా తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కాగా తాను ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నానని అదే రోజు బాలయ్య చెప్పారు. పార్టీ బాధ్యత అప్పగిస్తే నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు. తెలంగాణపై టిడిపి కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఇప్పటికే పార్టీ కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు. తమ పార్టీ ఇటీవల ప్రవేశ పెట్టిన బిసి డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆ వర్గాలు తమ పార్టీతోనే ఉంటాయని అన్నారు. ఇలా వరుస భేటీలు, తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని బాలకృష్ణ చెప్పిన నేపథ్యంలో ఆయన సాధ్యమైనంత త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications