ధర్మాన పసిగట్టారు, కిరణ్ రెడ్డి గుర్తించాలి: విహెచ్

ధర్మాన రాజీనామా విషయంలో పార్టీ అధిష్టానం తనకు చెప్పాలని ముఖ్యమంత్రి చూడకూడదని, అవినీతి కేసుల్లో చిక్కుకున్నవారిని అధిష్టానం పక్కన పెడుతోందని, దాన్ని గుర్తించి ధర్మాన రాజీనామా విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ధర్మాన రాజీనామా విషయంలో ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రాజీనామా చేయడానికి ధర్మాన తనంత తాను ముందుకు వచ్చారని, రాజీనామా చేయాలని ధర్మానకు ఎవరూ చెప్పలేదని ఆయన అన్నారు. ధర్మాన వ్యవహారాన్ని బిసి కోణంలో కాకుడా పార్టీ కోణంలో చూడాలని ఆయన సూచించారు.
ఇదిలా వుంటే, ధర్మాన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించకపోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. తప్పు చేసినవారిని ముఖ్యమంత్రి ఎందుకు తొలగించడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. రాష్ట్రంలో యమధర్మరాజు పాలన సాగుతోందని, కిరణ్ కుమార్ రెడ్డి యముడైతే మంత్రులు యమకింకరులని ఆయన వ్యాఖ్యానించారు.
ధర్మాన రాజీనామా ఇచ్చినా ఆమోదించకపోవడం సరి కాదని ఆయన అన్నారు. కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కొనసాగించడాన్ని ఆయన తప్పు పట్టారు. మంత్రి పార్థసారథిని కోర్టు దోషిగా నిర్ధారించిందని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో మంత్రి ఎరాసు ప్రతాప రెడ్డి పాత్ర ఉందని, అయినా వారిద్దరిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులు తప్పు చేసినా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. కేసులో సిబిఐ, ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications