లైంగిక వేధింపులు: ఎస్వీయు ప్రొఫెసర్ దంపతుల అరెస్ట్

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డొమ్మిగూడ మండలం అరకు వద్ద అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు లారీని సీజ్ చేశారు. జిల్లాలోని హుకుంపేట పరిసరాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 150 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసి నలుగురిని అరెస్టు చేశారు.
ఆంధ్రా - తమిళనాడు సరిహద్దులలో తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుజాము నుంచి ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు రవాణా, కమర్షియల్ టాక్స్ కౌంటర్ల వద్ద అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.56,795 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేపడుతామని ఎసిబి అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications