మహాత్ముడితో జగన్: డిఎస్పీ స్థాయిలో విచారణ, కేసు!

కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని జాతిపిత మహాత్మా గాంధీతో పోల్చుతూ ఓ ఫ్లెక్సీ ఇటీవల వెలిసిన విషయం తెలిసిందే. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గుంటూరులో జగన్‌ను మహాత్ముడితో పోల్చుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అందరికీ జుగుప్సను కలిగించింది. జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీనివాస రావు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. జగన్‌ను, మహాత్ముడిని పక్క పక్కన ఉంచి వారిద్దరినీ జైలులో ఉన్నట్లు ఆ ఫ్లెక్సీలో చిత్రీకరించారు.
తెల్లదొరల కాలంలో మహాత్ముడు జైలుకు వెళ్లారని, నల్ల దొరల కాలంలో జగనన్న జైలుకు వెళ్లారని ఆ ఫ్లెక్సీలో రాశారు. అంతేకాదు ఓ మహాత్మా ఇది న్యాయమా అంటూ చివరలో రెండు వ్యాఖ్యలు కూడా రాశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. గాంధేయవాదులు, స్వాతంత్ర్యాభిమానులు, సామాన్యులు, రాజకీయ నేతలు అందరూ దీనిని ముక్తకంఠంతో ఖండించారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై జగన్ పార్టీ నేతలు కూడా మౌనం వహించారు.
ఫ్లెక్సీ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు అక్కడకు వచ్చి దానిని చించి వేశారు. ఇలాంటి ఫ్లెక్సీలు భవిష్యత్తులో ఏర్పాటు చేయకుండా తాజా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన శ్రీనివాస రావుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్‌ను గాంధీజీతో పోల్చడం సిగ్గు చేటు అన్నారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications