ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బిసి ప్రేమ కొంగ జపం: ముఖ్యమంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిసి ప్రేమ కొంగ జపంలాంటిదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాటలో భాగంగా ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గొర్రెల పెంపకందార్ల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు బాగోతం బిసీలందరికీ తెలుసునని ఆయన అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. జంగారెడ్డిగూడెంలో ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

పోలవరం టెండర్లను ఖరారు చేయడానికి హైపవర్ కమిటీని నియమించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. పోలవరం నిర్మాణానికి అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న వారి బాధను ప్రభుత్వం అర్ధం చేసుకుందని అన్నారు. మొదటి విడతలో 7 గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేస్తామని తెలిపారు

శుక్రవారం ఉదయం ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోలవరం డ్యాం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పోలవరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై చత్తీస్‌గఢ్, ఒడిశా ముఖ్యమంత్రులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులు పలు సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.

కాగా ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట పర్యటన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండల పరిధిలో కొన్ని గ్రామాలకు అధికారులు కరెంట్ నిలిపివేశారు. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ దిగేందుకు కరెంట్ తీగలు అడ్డు వస్తున్నాయనే కారణంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

English summary
CM Kiran kumar Reddy said that Polavaram project, proposed on Godavari river, will be completed within 5 years. As a part of Indiramma baata he visted the Polavaram dam today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X