పూణేను మరోసారి వణికించిన బాంబు పేలుడు

Bomb blast shakes Pune again, police start investigation
పూణే: మహారాష్ట్రలోని పూణే నగరాన్ని మరోసారి బాంబు పేలుడు వణికించింది. పూణేలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఆ పేలుడులో ఒకరు గాయపడినట్లు సమాచారం. ప్రాణ నష్టమేదీ సంభవించలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు భద్రతను పెంచారు, గస్తీని ముమ్మరం చేశారు.

పూణేలోని డాంగే చౌక్‌లో గల తారా కాంప్లెక్స్ వద్ద సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఇది ఉగ్రవాదుల చర్య కాకపోవచ్చునని పోలీసులు అంటున్నారు. స్వల్ప తీవ్రత గల బాంబు మాత్రమే పేలిందని చెబుతున్నారు. బాంబు స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఓ వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగులో రసాయనాలు తీసుకుని వెళ్తుండగా అది పేలినట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తే గాయపడినట్లు సమాచారం. గత మూడో వారాల్లో పూణేలో పేలుళ్లు సంభవించడం ఇది రెండో సారి. ఆగస్టు 1వ తేదీన పూణేలో వరుస పేలుళ్లు సంభవించాయి.

గత వరుస పేలుళ్లతో ఉగ్రవాదులకు సంబంధం లేదని పోలీసులు తొలుత ప్రకటించారు. అయితే, ఇందులో ఇండియన్ ముజాహిదీన్ పాత్ర ఉందని తర్వాత చెప్పారు. మహారాష్ట్రకు చెందిన సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూణేలో పేలుళ్లు సంభవించడం కూడా ఇది రెండోసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+