వైయస్ జగన్ సన్నిహితుడికి 9 కోట్లిచ్చా: భాను కిరణ్

ఆ ప్రాజెక్టులో ఏయే కాంట్రాక్టులు ఎవరెవరికి ఇప్పించి, ఎంతెంత వసూలు చేసిందీ సిఐడి రెండో చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. హంద్రీనీవా ప్రాజెక్టులో మొత్తం రూ.170 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న మూడు నిర్మాణ సంస్థలను బెదిరించి భాను రూ.18 కోట్లు వసూలు చేశాడని సిఐడి అభియోగం మోపింది. జీవీఆర్ అనే నిర్మాణ సంస్థకు రూ.66 కోట్ల విలువైన కాంట్రాక్టు సెటిల్ చేసిన కేసులో రూ.6.5 కోట్లు, జేకే కన్‌స్ట్రక్షన్ సంస్థకు రూ.72 కోట్ల విలువైన కాంట్రాక్టు ఇప్పించినందుకు రూ.8.6కోట్లు, కోస్టల్ కన్‌స్ట్రక్షన్‌కు రూ.30 కోట్ల కాంట్రాక్టు దక్కేందుకు సాయం చేసినందుకు రూ.3 కోట్లు వసూలు చేశారని సిఐడి ఆరోపించింది.
తాము వసూలు చేసిన మొత్తంలో ప్రధానమైనది జగన్ అనుచరుడు నీలం శ్రీనివాస్ అలియాస్ చిన్నా అనే వ్యక్తికి భాను రూ.9 కోట్లు ఇచ్చినట్లు భాను వెల్లడించినట్లు సిఐడి నాంపల్లి కోర్టుకు నివేదించింది. పరిటాల హత్య కేసులో నిందితుడుగా ఉంటూ నే జైల్లో హత్యకు గురైన మొద్దు శీనుకు రూ. కోటి, దంతలూరి కృష్ణకు రూ.కోటి మూడు లక్షలు, సూరి సోదరి హేమలతకు రూ.20 లక్షలు ఇచ్చినట్లు భాను వెల్లడించారని పోలీసులు చార్జ్‌షీట్‌లో వివరించారు.
వైయస్ సంతాప కార్యక్రమాలకు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు భాను చెప్పాడు. గతంలో పరిటాల సునీతపై పొటీ చేసిన అభ్యర్థి కోసం రూ.30 లక్షలు ఖర్చు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గుర్నాథరెడ్డి సోదరుడు రెడ్డప్పరెడ్డి అనంతపురంలో ఒక సెటిల్‌మెంట్ విషయంలో రూ.80 లక్షలు ఆఫర్ చేసినట్లు సిఐడి గుర్తించింది.
మే నెలలో కోర్టుకు అందించిన రిమాండ్ డైరీలో, జూన్‌లో దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌లో భాను భూదందాలపై సీఐడీ పలు విషయాలు కోర్టుకు నివేదించింది. సూరి హత్య జరక్క ముందు అనిల్ అనే వ్యక్తి నుంచి రివాల్వర్ తీసుకున్నట్లు, అప్పటికే తన వద్ద కొన్ని గన్‌లు ఉండటంతో.. వాటిలో రెండు రోగిటపల్లి నరేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి అనే ఇద్దరికి ఇచ్చినట్లు భాను వెల్లడించినట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications