చంద్రబాబుకు మనసొప్పదు: ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి

అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటూ చంద్రబాబు వాటి చుట్టే తిరిగారని, అయినా హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని, ఎదుటివారి వైపు వేలు చూపించే ముందు తన వెనక కూడా చూసుకోవాలని ఆయన అన్నారు. తాము రైతుల వల్ల, రైతు కూలీల వల్లనే అధికారంలో ఉన్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 14 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని ఆయన చెప్పారు. రూ.5.75 కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు. రైతు నాయకులకు, ప్రభుత్వానికి మధ్య తేడాలు వస్తుంటాయని, దానికి కారణం ఉందని ఆయన అన్నారు.
ప్రభుత్వం చేసిన పనులను రైతు నాయకులు చెప్పరని, తాము చేయాల్సినవే చెబుతారని, తాము చేసినవి చెబుతూ ఇవి చేయాలని చెప్పాలని ఆయన అన్నారు. రైతులకు ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో ఎక్కువ చేశామని, అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు తన వంతు కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. కేద్రం ప్రభుత్వం రైతు రుణాలపై వడ్డీని 8.5 శాతానికి తగ్గించిందని, వడ్డీలో 1.5 శాతాన్ని నేరుగా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తోందని, మిగతా మొత్తాన్ని రైతులు సకాలంలో చెల్లిస్తే సబ్సిడీ కూడా ఇస్తోందని ఆయన అన్నారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన రైతలుకు మునుపెన్నడూ లేని విధంగా సహాయం అందించామని ఆయన చెప్పారు. ఒక ఏడాదిలో తాము ఇచ్చినంత పెద్ద మొత్తంలో చెల్లించిన సందర్భాలు దైశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. మొత్తం సబ్సిడీ ఇచ్చామని చెప్పడం లేదు కానీ మునుపటి కన్నా మెరుగ్గా ఇచ్చామని ఆయన అన్నారు. రైతులు ప్రత్యామ్నాయాల వైపు చూడాలని ఆయన సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల వైపు రైతులు దృష్టి సారించాలని ఆయన అన్నారు. రైతులను ఆదుకోవడానికి యాంత్రీకరణను సబ్సిడీల ద్వారా ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. విద్యుత్ ఇబ్బంది అందరికీ ఉందని, డీమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య తేడా చాలా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications