జగన్ పార్టీ హిట్, క్యూలో సినీతారలు: నటుడు గిరిబాబు

వచ్చే ఎన్నికలలో ప్రజల వద్దకెళ్లి.. దివంగత వైయస్ ఉన్నప్పుడు అమలైన పథకాలేమిటి, ఇప్పుడు వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారు అని కళాకారులు చెప్పాలని సూచించారు. సినీ రంగం నుంచి ఇంకా చాలామంది పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో జగన్ తిరుగులేని నాయకుడని, ఆయన ప్రజల వద్దకు వెళుతున్నారనే దుగ్దతోనే జైలులో పెట్టారని మరో నటుడు విజయచందర్ ఆరోపించారు. తాను జగన్‌ను జైలులో ఉండగా చూడలేనని, అందుకే కలిసే యత్నం చేయలేదన్నారు.
వైయస్ మరణం తర్వాత రాష్ట్రంలో సమర్థ నాయకులు కొరవడ్డారని, ఆ లోటును పూడ్చడం వైయస్ జగన్ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. వైయస్ అసంపూర్తిగా వదిలి వెళ్లిన పథకాల అమలు జగన్‌కే సాధ్యమన్నారు. ఓదార్పు యాత్రలో జగన్ వెంట తిరిగానని, అందుకే ఈ విషయం చెప్పగలుగుతున్నానని అన్నారు.
తన తండ్రి మరణించాక రెండున్నరేళ్లుగా జగన్ గ్రామాలలో తిరుగుతూ, ప్రజల మధ్యనే ఉంటూ వారి పేదరికాన్ని దగ్గరగా చూశారన్నారు. తాను అధికారంలోకి వస్తే వారందరి సమస్యలు తీర్చాలన్న తపన జగన్‌కుందన్నారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్‌కు, సినీ, టివి రంగం వారు మద్దతునివ్వడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని వంగపండు ఉష ఆధ్వర్యంలో నిర్వహించారు.












Click it and Unblock the Notifications