టిడిపి గవర్నమెంటా: కిరణ్‌పై మళ్లీ మండిపడ్డ శంకరన్న

P Shankar Rao
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నదా లేక కాంగ్రెసు ప్రభుత్వం ఉన్నదా అనే అనుమానం కాంగ్రెసు పార్టీ కార్యకర్తల్లో కలుగుతోందని మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి అని తెలిసి ప్రభుత్వం ప్రకటనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ ప్రభుత్వం వ్యవహార శైలి రాజీవ్, ఇందిర గాంధీలను పార్టీకి దూరం చేసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్‌కు మహాత్మా గాంధీ కుటుంబం తర్వాత నెహ్రూ కుటుంబం ఓ వరమన్నారు. ఇది ఎవరూ మర్చిపోవద్దన్నారు. అలాంటి కుటుంబంలోని రాజీవ్ గాంధీకి ప్రకటన ఇవ్వక పోవడం గర్హనీయమన్నారు. ప్రకటన వేయించేందుకు ప్రభుత్వం వద్ద రూ.10 లక్షలు కూడా లేవా అని ప్రశ్నించారు. 150 ప్రభుత్వం శాఖలలో ఒక్క డిపార్ట్‌మెంట్ కూడా స్పందించక పోవడం సరికాదన్నారు. దేశ సమైక్యతకు, మత సామరస్యం కోసం, స్వాతంత్ర్యం కోసం గాంధీ - నెహ్రూ కుటుంబాలు ప్రాణాలు అర్పించాయన్నారు.

అలాంటి వారిని విస్మరించకూ డదన్నారు. రాజీవ్ ఆలోచనలను ముందుకు తీసుకు వెళ్లాలని కాంగ్రెసు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ను కీర్తిస్తూ ప్రకటనలు ఇచ్చిందని, కిరణ్ సర్కారు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. కాగా గాంధీ భవనంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో పాల్గొన్న కేంద్రమంత్రి పల్లం రాజు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ ప్రణాళికతో పని చేయాలని, ప్రజావసరాలను తీర్చకుంటే భావితరాలు మనల్ని క్షమించవన్నారు. పార్టీ పరిస్థితి ఇళాగే ఉంటే 2014లో గెలుపొందడం కష్టమన్నారు. రాజీవ్ దారిలో పాలన ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో బిసిలకు అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత రావు వేరుగా అన్నారు. అగ్రవర్ణాల వారు దయతలిస్తేనే బిసి నేత ముఖ్యమంత్రి అవుతారన్నారు. పార్టీ బడుగులకు ప్రాధాన్యమిస్తుందనే నమ్మకం ఉందని, కేబినెట్ విస్తరణలో బిసిలకు ప్రాధాన్యం ఇవ్వాలని తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+