విజయమ్మకు తెలియదు: బండారు, సిఎంపై గాలి ఫైర్

బిసీలకు ఎవరకు న్యాయం చేశారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. దమ్ముంటే కాంగ్రెసు అధ్యక్షుడు సోనియా గాంధీ ఇంటి ముందు విజయమ్మ ధర్నా చేయాలని, తాము కూడా అందుకు సంఘీభావం ప్రకటిస్తామని ఆయన అన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాద రావుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెనకడుగు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మరో నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్ర స్థాయికి చేరుకున్నా ముఖ్యమంత్రి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వాస్పత్రుల్లో చిన్నపిల్లల మరణాలపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అవినితి మంత్రులను తక్షణమే పదవుల నుంచి తొలిగించాలని ఆయన అన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని కాదని ధర్మాన వాన్‌పిక్‌కు భూములు ఇచ్చారని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన దోపిడీకి పాల్పడ్డారని ఆయన అన్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావుకు మద్దతు పలకడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications