బాబు మానసిక స్థితి అర్థమౌతోంది: వైయస్ విజయమ్మ

YS Vijayamma
కడప: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు తనవే అంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి ఏవిధంగా ఉందో ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం అన్నారు. బిసి జనాభా ప్రాతిపదికన వంద అసెంబ్లీ స్థానాలను లాటరీ ద్వారా నిర్ణయిద్దాం.. ఆ సీట్లల్లో బిసి అభ్యర్థులను మాత్రమే నిలబెడదామంటూ విజయమ్మ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో.. సోమవారం పులివెందులలో పలువురు బిసి సంఘాలకు చెందిన నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు.

వైయస్సార్ కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు నాయకులు పులివెందులలోని విజయమ్మ కార్యాలయానికి తరలి వచ్చారు. అక్కడ మిఠాయిలు పంచి విజయమ్మకు శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల చదువుల గురించి పట్టించుకోలేదని, కళాశాలలకు ఎప్పుడైనా వెళ్లారా అని ప్రశ్నించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే ఏదైనా మంచి ఆలోచన చేశారా అన్నారు. చివరకు సాధారణ ప్రజలను కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల రాష్ట్రంలో బిసిలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు.

బాబు నిజ స్వరూపం బయటపడింది.. గట్టు

బలహీన వర్గాలకు చెందిన వంద మందిని ఎమ్మెల్యేలను చేయాలని విజయమ్మ చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు మిన్నకుండిపోవడంతో ఆయన నిజస్వరూపం బయటపడిందని గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. విజయమ్మ చేసిన ప్రతిపాదనకు బిసి సంఘాలు, టిడిపిలోని పేద బిసి నేతలు హర్షిస్తుంటే చంద్రబాబు మాత్రం తేలు కుట్టిన దొంగ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయమ్మ లేఖతో చంద్రబాబుకు దిమ్మ తిరిగిందన్నారు. ఎన్టీఆర్ హయాంలో సహకార రంగంలో సభ్యత్వ రుసుము రూ.11 ఉంటే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని రూ.300లకు పెంచారని విమర్శించారు.

బిసి కార్పొరేషన్‌లను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో బీసీలిచ్చిన తీర్పుతో చంద్రబాబు దిమ్మతిరిగి డిక్లరేషన్ అంటూ దొంగ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. విజయమ్మ చేసిన ప్రతిపాదనపై బీసీ కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24న బీసీ నేతలతో సమావేశం కానున్నట్లు గట్టు వెల్లడించారు. చంద్రబాబు మాటలు నమ్మి శాలువాలు కప్పిన బీసీ నేతలు వైఎస్‌ఆర్ సీపీ చేసిన ప్రతిపాదనకు ఆయన్ని ఒప్పించాలని గట్టు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+