ఉద్యోగం ఇప్పిస్తానని ఇంటికి పిలిచి పలుమార్లు రేప్

ఉద్యోగం పేరుతో అతను ఆ అమ్మాయిని పలుమార్లు ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమె ఇంటికి వచ్చినప్పుడు మాటల్లో దించి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఇలా పలుమార్లు ఆమెపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
మరోవైపు ఖమ్మం జిల్లాలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల కొడుకు మృతి చెందాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ వృద్ద దంపతులు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని కల్లాడ మండలం తర్నవల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి శివారులోని పాడబడ్డ బావిలో మంగళవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications