గీతిక ఆత్మహత్య: చిక్కుల్లో బాలీవుడ్ నటి నూపుర్

హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా, గీతికా శర్మ సంబంధంపై ఆమె వ్యాఖ్యలు చేసింది. మూత పడిన ఎండిఎల్ఆర్‌లో గీతికాతో పాటు నూపుర్ కూడా పనిచేసింది. ఎండిఎల్ఆర్ యజమాని గోపాల్ కందా గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడు. ఎండిఎల్ఆర్ మూతపడిన తర్వాత ఆమె గోవా కాసినోలో 2009లో చేరింది.
ఎయిర్ హోస్టెస్ ఎవరినీ గోపాల్ కందా తీసేయలేదని, వాళ్లు కాసినోలో పనిచేస్తున్నారని తాను చేరిన తర్వాత తెలిసి ఆశ్చర్యపోయానని నూపుర్ మెహతా అన్నది. కందాకు అత్యంత ముఖ్యమైన మిత్రులు, పరిచితులు ఉన్నారని, వారిలో అతి ముఖ్యమైన కాంగ్రెసు నాయకులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని, వారు కాసినోకు వచ్చేవారని ఆమె అన్నది.
నూపుర్ కథనం ప్రకారం - కందాతో వైవాహికేతర సంబంధం ఉన్నట్లు భావిస్తున్న అంకితతో గీతికకు వ్యక్తిగత విరోధం ఉంది. అంకితకు, కందాకు ఓ పాప ఉందని చెబుతారు. అంకితపై గీతిక కేసు కూడా పెట్టింది. తన సూసైడ్ నోట్‌లో గీతిక ఆశ్చర్యకరంగా అంకిత పేరును కూడా ప్రస్తావించింది.
గీతిక ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు ఎండిఎల్ఆర్ మరో ఉద్యోగి చాంద్ శివరూప్‌ను అరెస్టు చేశారు. శివరూప్ ఎండిఎల్ఆర్ హెచ్ఆర్ మేనేజర్. గీతిక శర్మపై శివరూప్ తప్పుడు ఆరోపణలు చేశారని, దుబాయ్ పంపించేస్తానని బెదిరించారని అంటారు. అయితే, గీతికా శర్మ కేసులో నూపుర్ మెహతా వాంగ్మూలం పలు విషయాలను వెల్లడించవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications