విజయమ్మపై ఆనం ఫైర్: ఒక్కమగాడని టిడిపి కితాబు

Rajendra Prasad
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెసు నేత, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బుధవారం కితాబిచ్చారు. ఆయనను ఒక్కమగాడు అంటూ ప్రశంసలు కురిపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై ఆనం రెండు రోజుల క్ర్తితం నిప్పులు కక్కిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజేంద్ర ప్రసాద్ బుధవారం స్పందించారు.

మొత్తం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మగాడు.. ఆనం అని అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ అవినీతికి ఆనాటి బిసి మంత్రులు జైలుపాలై కేసుల్లో ఇరుక్కొన్నారని... దీనికి విజయమ్మ ఏం సమాధానం చెబుతారని ఆనం ధైర్యంగా నిలదీసి ప్రశ్నించారని గుర్తు చేశారు. మిగిలిన మంత్రులు అంతర్గత సమావేశాల్లో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే తప్ప బయటకు వచ్చి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారని విమర్శించారు. అందరూ బయటకు రావాలన్నారు.

అధికార పార్టీకి చెందిన మంత్రులపై సిబిఐ అల్లాటప్పాగా కేసులు నమోదు చేస్తుందా అని ప్రశ్నించారు. జరిగిన అవినీతి వ్యవహారాల్లో వీరి పాత్ర ఉండబట్టే నిందితులుగా నమోదయ్యారని పేర్కొన్నారు. వాన్‌పిక్ కంపెనీకి నాలుగు వేల ఎకరాల భూమి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానిస్తే 28 వేల ఎకరాలు ఇస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ఎలా జీవో ఇచ్చారని ప్రశ్నించారు. వాన్‌పిక్‌లో మంత్రివర్గ నిర్ణయం ఒకటి.. తర్వాత ధర్మాన ఇచ్చిన జీవోలు వేరని, అసెంబ్లీలో లాజిక్కులు, మ్యాజిక్కులతో ధారావాహికగా ఉపన్యాసాలు చేసే ధర్మాన గొంతు ఇప్పుడు ఎందుకు లేవడం లేదని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+