బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్: జగన్ మీడియాకు కోర్టులో ఊరట

Sakshi Media
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా గ్రూపులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఊరట లభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల్లోని సాక్షి కరెంటు ఖాతాల నిర్వహణకు తగిన బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన తర్వాత ఏవైనా మొత్తాలు మిగిలితే వాటిని ఎస్‌బిఐకి మళ్లించి, ఆ బ్యాంకు నుంచే లావాదేవీలన్నింటినీ నిర్వహించుకునేందుకు సాక్షి యాజమాన్యానికి హైకోర్టు అనుమతించింది.

ఈ మేరకు న్యాయమూర్తి బెజ్జారం చంద్ర కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐ స్తంభింపజేయని కెనరా బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాలను బ్యాంకు గ్యారంటీలను సమర్పించేందుకు ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలంటూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. గతవారం ఇదే వ్యవహారానికి సంబంధించి వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు.. తమ అనుమతి లేకుండా ఎటువంటి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ ఈ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ చంద్ర కుమార్ విచారించారు.

గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కరెంటు ఖాతాల నిర్వహణకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉందని, అయితే అందుకు అవసరమైన మొత్తాలు కెనరా బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. ఆ ఖాతాల నిర్వహణకు అనుమతిస్తే బ్యాంకు గ్యారంటీలు సమర్పించగలమని ఆయన వివరించారు. కోర్టు అనుమతిస్తే ఎస్‌బీఐ నుంచే అన్ని లావాదేవీలను నిర్వహించుకుంటామని తెలిపారు.

వాదనలు విన్న న్యాయమూర్తి.. బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన తరువాత.. మిగిలిన మొత్తాలను ఎస్‌బీఐకి మళ్లించి, ఆ బ్యాంకు ద్వారానే లావాదేవీలు నిర్వహించుకోవాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేశారు. అంతేకాక జిల్లాలో ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలను మూసివేసి, ఆ మొత్తాలను ఎస్‌బీఐకి మళ్లించుకోవచ్చునని స్పష్టం చేశారు. బ్యాంకు గ్యారంటీల సమర్పణకు ముందు కెనరా బ్యాంకు ఖాతాల వివరాలను సీబీఐకి సమర్పించాలని.. సీబీఐ ఆ ఖాతాల వివరాలను పరిశీలించి, మూడు వారాల్లో ఆమోదముద్ర వేయాలని.. ఆ తర్వాతే ఎస్‌బిఐకి కెనరా బ్యాంకు ఖాతాల్లోని నిధులను మళ్లించుకోవచ్చునని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+