ఐఐటి తెలుగు విద్యార్థి ఆత్మహత్య: ఆ మూడు రోజుల్లో..

శని, ఆదివారాలు, సోమవారం రంజాన్ కావడంతో మూడు రోజుల సెలవులు ప్రకటించడంతో ఊరికెళ్లి వస్తానని మానస చెప్పిందని హాస్టల్ వార్డెన్ చెబుతున్నారు. అయితే ఆమె ఇంటికి రాలేదని తండ్రి రాజేశం చెప్పాడు. మానసకు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాసులుతో వివాహమైందని, పెళ్లి విషయంలో ఇద్దరి కుటుంబాల మధ్య జరిగిన గొడవలే ఆత్మహత్యకు దారితీసి ఉంటాయని పోలీసుల అనుమానిస్తున్నారు.
అయితే పెళ్లి విషయం తమకు తెలియదని మానస కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సెలవుల్లో ఆమె ఎవరితోనైనా ఘర్షణ పడి ఉంటుందని, సెలవుల తర్వాత హాస్టల్‌కు రాగానే ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మానస వయస్సు 21. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తలుపులు బిగించడానికి వెళ్లిన వడ్రంగి దుప్పటితో ఉరేసుకుని వేలాడుతున్న మానసను చూసి, అధికారులకు తెలియజేశాడు.












Click it and Unblock the Notifications