పాము కరిచిందని..: వెంటపడి మరీ కొరికి చంపేశాడు

అతను తన వరిపొలంలో పని చేసుకుంటుండగా ఆ పాము అతడిని కాటేసింది. దాంతో విపరీతంగా కోపం వచ్చిన సాల్మో ఆ పాము వెంట పడి మరీ కొంత దూరంలోనే పట్టుకున్నాడు. కోపం ఆపుకోలేక దాన్ని తన నోటితో కొరికి చంపేశాడు. ఘటన జరిగిన వెంటనే సాల్మోను గ్రామంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.
దీనిపై సాల్మో స్పందిస్తూ.. తాను తనను కరచిన నాగుపామును తాను కర్రతో గానీ మరో వస్తువుతో గానీ చంపవచ్చునని, కానీ తనకు బాగా కోపం వచ్చినందున అదే ఆవేశంలో కొరికి చంపినట్లు చెప్పాడు. సాల్మా వయస్సు 55. ఇతను నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఉంటాడు.












Click it and Unblock the Notifications