అమ్మగారి చుట్టూ కొంగ జపం: కిరణ్ రెడ్డిపై రేవంత్ రెడ్డి

ప్రధానమైన విద్యుత్ శాఖకు మంత్రిని నియమించలేని అసమర్థ ప్రభుత్వం వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై ఆందోళనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం పాలనలో ఏడు సంవత్సరాల పాటు కరువు సంభవించినా విద్యుత్‌ను అందించి రైతులను ఆదుకున్న ఘనత తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే విద్యుత్ సమస్య తలెత్తిందని వాపోయారు. లక్ష మిల్లీ యూనిట్ల విద్యుత్ అవసరపడుతోందని నివేదిక ఇచ్చిన అధికారిని బదిలీ చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు వారి పరపతిని కాపాడుకునేందుకు విమర్శలు చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించలేకపోతున్నారని ఆరోపించారు.
మీడియా ప్రతినిధుల సమావేశంలో నాయకులు మధుసూదన్‌యాదవ్, ఎమ్‌డీ.యూసుఫ్, నందారంప్రశాంత్, సంజీవ్‌రెడ్డి, టీ.శేఖర్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications