సిఎం నవ్వుకుంటున్నారు:టిజి, మార్పు లేదు: పాల్వాయి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ గంటకు పైగా మాట్లాడారని, మార్చదలుచుకుంటే అంత సేపు సోనియా ముఖ్యమంత్రితో మాట్లాడబోరని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తి కాలం ఉంటారని ఆయన అన్నారు. సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డికి గంట సమయం ఇచ్చారంటే ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు.
రాజ్యసభ చిరంజీవికి మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. ఆ విషయం త్వరలోనే తెలుస్తుందని ఆయన అన్నారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి గానీ పిసిసి అధ్యక్షుడికి గానీ ఏ విధమైన ఢోకా లేదని ఆయన అన్నారు. ముగ్గురు దేవుళ్లు కరుణిస్తేనే కరెంట్ సమస్య నుంచి గట్టెక్కుతామని టిజి వెంకటేష్ అన్నారు. నీటి కోసం వరుణదేవుడు, సింగరేణి బొగ్గు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, గ్యాస్ కోసం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కరుణిస్తే కరెంట్ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిని మారుస్తారనే వార్తలను రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా ఖండించారు. తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాతనే నాయకత్వ మార్పు ఉంటుందని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడబోతోందని ఆయన అన్నారు. డబ్బుల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజైన్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం పర్యావరణ అనుమతులు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకూడదని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంటు సభ్యులను సమీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో అధికారులు, ఇంజనీర్లు తప్పు దారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications