16 మెట్లెక్కిన 11 నెలల పాప, మూఢ విశ్వాసంతో..

Sangameswara temple
హైదరాబాద్: ఊరికి, గుడికి మంచి జరుగుతుందని నమ్మకంతో ఏడాది కూడా నిండని పసిపాపకు నరకం చూపించారు గ్రామ ప్రజలు. ఏకంగా 160 మెట్లు ఎక్కించారు. మోకాళ్ల మీద పాకే పసిపాపను అన్ని మెట్లు ఎక్కించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని సంగమేశ్వర కొండ వద్ద ఇటీవల జరిగిన ఈ ఉదంతంపై బాలల హక్కుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసింది.

వారి కథనం ప్రకారం - ఆమదాలవలసకు చెందిన గేదెల హరికృష్ణ కూతురు అఖిలకు 11 నెలలు. గ్రామానికి మేలు జరుగుతుందనే మూఢ విశ్వాసంతో అఖిలను ఊళ్లోని సంగమేశ్వర కొండ మెట్లు ఎక్కించారు. కటిక నేలపై రాపిడికి గురికావడంతో అఖిల మోకాళ్లు కొట్టుకుపోయాయి. అయితే, పాప తల్లిదండ్రులు భిన్నమైన కథనాన్ని వినిపిస్తున్నారు.

ఈ కొండ వద్దకు తాము సరదాగా వ్యాహ్యాళికి వెళ్లామని, కొండ దిగువ భాగాన తాము తొలిమెట్టు వద్ద నిలిచి ఉండగా అఖిల మెట్లపైకి పాకడం ప్రారంభించిందని అఖిల తండ్రి హరికృష్ణ తెలిపారు. అలా ఎంత వరకూ వెళ్లగలదో చూద్దామని అనుసరించగా, 2 గంటల వ్యవధిలో పాప అన్ని మెట్లనూ ఎక్కేసిందని చెప్పారు.

అయితే, ఈనవిషయంపై బాలల హక్కుల సంఘం ద్వారా ఫిర్యాదును అందుకున్న హెచ్చార్సీ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సెప్టెంబరు 12 లోగా సమగ్ర నివేదిక పంపాలని శ్రీకాకుళం ఎస్పీని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+