సిఎం అంటే జగన్‌లా!: రోజా, విజయమ్మ సవాల్‌పై ప్రశ్న

Roja
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఇరుక్కొని అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో బయటకు వస్తాడని... ముఖ్యమంత్రి కూడా అవుతాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ సినీ నటి రోజా ఆదివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలన్న విధంగా పరిపాలన చేసి చరిత్రను తిరగరాస్తారని అన్నారు.

వైయస్ జగన్ సన్నని వైరులా ఉంటారని, అయినప్పటికీ ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు షాక్ ఇస్తున్నట్లుగా ఉంటుందని అన్నారు. జగన్‌కు రాహు, కేతువుల్లా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అడ్డు పడుతున్నాయన్నారు. బిసిలకు వంద స్థానాలు ఇద్దామని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విసిరిన సవాలును టిడిపి, కాంగ్రెసులు దమ్ముంటే స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. విజయమ్మ చిత్తశుద్ధితో చేసిన ప్రతిపాదనపై ఈ రెండు పార్టీలు గుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప ముందుకు రావడం లేదని విమర్శించారు.

ప్రజాధరణ పొందుతున్న జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని, అయితే అదెంతో కాలం సాగదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ప్రతి గడపకూ ఏదో లబ్ధి చేకూరుందని.. అందుకే ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోయారన్నారు. కుట్ర వల్ల భర్త మరణిస్తేకుమారుడు జైలు పాలయితే గుండె దిటువు చేసుకొని విజయమ్మ మన మధ్యకు రావడం హర్షణీయమన్నారు.

కాగా ఈ కార్యక్రమంలో వేదికపై మేడ్చల్ నియోజకవర్గం నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని విజయమ్మ సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువ కప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు రాష్ట్ర నాయకులు వైవి సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, గట్టు రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రి మారెప్పా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ను సిఎం చేయడమే లక్ష్యమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+