హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు విదేశీ పర్యటనలపై లక్ష్మీ పార్వతి కన్ను

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ గత 15 సంవత్సరాలుగా చేసిన విదేశీ పర్యటనలు, విదేశాలలో వారి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాల్సిందిగా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆమె ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. తన అల్లుడైన చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె ఆ లేఖలో తెలిపారు. చంద్రబాబు విదేశీ పర్యటన వ్యక్తిగతమైతే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ లోగడ తెహల్కా పత్రిక చంద్రబానును దేశంలోని అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకునిగా ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు.

బాబుకు సింగపూర్, మలేషియాలలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొందని ఆమె తెలిపారు. కాబట్టి దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. గతంలో వీటిపై విచారణ జరపాల్సిందిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కోర్టుకు నివేదించినా అత్యంత దురదృష్టకరమైన రీతిలో ఆ పిటిషన్ తిరస్కరణకు గురైందని ఆమె అన్నారు.

చంద్రబాబు పార్టీ ద్వారా 2009 తర్వాత సిఎం రమేష్, వైవి సుజనాచౌదరి ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారని, ప్రజా జీవితంలో పెద్దగా కనిపించని వీరు రాజ్యసభకు వెళ్లడం ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించిందని ఆమె అన్నారు. 2009 సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి ద్వారానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం మనీ లాండరింగ్ చేసిందని ఆమె ఆరోపించారు.

మనీ లాండరింగ్ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉన్నట్లు హసనీ అలీ వెల్లడించిన విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చిందని ఆమె గుర్తు చేశా్రు. అప్పట్లో హసన్ అలీ వ్యవహారం బయటకు వచ్చిన కొద్ది రోజుల్లనే చంద్రబాబు హడావిడిగా విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె అన్నారు.

English summary

 NTR Telugudesam party president Laxmi Parvathi appealed to PM Manmohan Singh to order for inquiry on Telugudesam party president N Chandrababu Naidu's foreign trips. She wrote a letter to PM on this effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X