న్యూ కొలవేరిడీ: ఊపేస్తున్న కుర్రాడు వేణు మల్లేష్

Venu Mallesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట కుర్రాడు నెట్‌లో తన పాట ద్వారా ఊపేస్తున్నాడు. అతను రూపొందించి పాడిన ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇట్స్ మై లైఫ్ పేరిట ఆంగ్లంలో దాన్ని రూపొందించాడు వేణు మల్లేష్. వేణు మల్లేష్‌ను సిఎన్ఎన్ ఐబియన్, దైనిక్ భాస్కర్ మీడియాలు ఆకాశానికెత్తాయి. ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఐబిఎన్ ఆంధ్రజ్యోతి వేణు మల్లేష్‌తో ప్రేక్షకులు మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. ఇట్స్ మై లైఫ్ వీడియో ఆల్బం సృష్టికర్తతో ప్రేక్షకులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

విశిష్టమైన దక్షిణ భారత ఆంగ్ల యాసలో పాడారని, ట్యూన్ వల్ల అది చాలా క్యాచీగా ఉందని సిఎన్ఎన్ ఐబియన్ వ్యాఖ్యానించింది. కొలవేరిడీని ఈ ఆల్బమ్ గుర్తు చేస్తోందని ప్రశంసించింది. అతి సాధారణమైన లిరిక్స్ ద్వారా అర్థాన్ని అందించడానికి ఇంగ్లీషులోని ఆ పాటలో ప్రయత్నించినట్లు విశ్లేషించింది. ఆ పాటను మొత్తం సిఎన్ఎన్ ఐబియన్ ఇచ్చింది.

సినిమా దర్శకత్వం తనకు ఫ్యాషన్ అని, తాను సినిమాలకు దర్శకత్వం వహిస్తానని వేణు మల్లేష్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ కార్యక్రమంలో చెప్పారు. తన పాట తప్పకుండా ఆదరణ పొందుతుందని భావించానని, అయితే ఇంత తొందరగా ఇంత పాపులర్ అవుతుందని అనుకోలేదని ఆయన అన్నారు. రెండు రోజుల్లో మూడు లక్షల హిట్స్‌ను ఇట్స్ మై లైఫ్ కొట్టేసింది. వ్యాకరణ రీత్యా పాటలో కొన్ని తప్పులున్నాయని, కావాలనే ఆ తప్పులు చేశానని, భావాలను అందించడమే భాష చేసే పని కాబట్టి కావాలనే గ్రామర్‌ను బ్రేక్ చేశానని ఆయన చెప్పారు.

వీడెందుకు పనికి రాడనే ఇతరుల మాటల నుంచి ఈ పాట పుట్టిందని వేణు మల్లేష్ అన్నారు. వర్ణణలు ఇందులో ఉండవని అతను అన్నాడు. ఇది నాన్ ఫిక్షన్ అని అతను చెబుతున్నాడు. అచ్చంపేట తెలంగాణలోని అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో ఒక్కటి. తాను పాటలు ఎప్పుడూ పాడలేదని, తన గురించి రాసుకున్న పాట కాబట్టి తాను పాడాలని అనుకున్నానని ఆయన చెప్పారు. అంతకు ముందు తాను ఎప్పుడూ పాటలు పాడలేదని ఆయన చెప్పారు. తాను దర్శకత్వం వహించే సినిమాలకు తాను సంగీతం సమకూర్చబోనని ఆయన చెప్పారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలకు భిన్నమైన సినిమాలను తీస్తానని, వాస్తవాలకు దగ్గరగా ఉండే సంఘటనలతో సినిమాలు చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+