జీవోల పాపమంతా జగన్‌దే, మంత్రులేమో బలి: పితాని

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. జగన్ చేసిన పాపాలవల్లే కొందరు ఐఏఎస్ అధికారులు నేడు జైలు జీవితం గడుపుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోల తయారీలో అక్రమాలు సృష్టించింది జగనేనని మంత్రి ఆరోపించారు. కేబినెట్ జారీచేసే జీవోలను తనకు అనుకూలంగా మలచుకుని వాటి ద్వారా ఆర్థిక లబ్ధి పొందింది కూడా జగనేనని వివరించారు.
కాంగ్రెస్‌వాదిగా పుట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వ్యక్తిగానే మరణించాడని పితాని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయన ఫొటో పెట్టుకుని రంగులు మార్చేసి మసిపూసి మారేడుకాయ చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications