టెక్కీ ఫ్లాట్ నుంచి దూకిన బాల కార్మికురాలు

Hyderabad
హైదరాబాద్: తనను పనికి పెట్టుకున్న టెక్కీ ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నంలో ఓ బాలిక రెండో అంతస్థులో ఉన్న ఫ్లాట్ నుంచి కిందికి దూకింది. ఈ సంఘటన శనివారం రాత్రిపూట హైదరాబాదులోని కుత్బుల్లాపూర్ సమీపంలోని ప్రగతినగర్‌లో జరిగింది. అదృష్టవశాత్తు ఆ బాలిక స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆ బాలికను కార్మిక శాఖ అధికారులు రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భుజంగరావు తన కేంద్రీయ విద్యాలయలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్యతో ప్రగతినగర్‌లోని శ్రీరవి రెసెడన్సీలోని రెండో అంతస్థు ఫ్లాట్‌లో ఉంటున్నాడు. ఇంటి పనుల కోసం ఏడాదిన్నర క్రితం వారు తెచ్చుకున్నారు. బాలికను ఇంట్లో ఉంచి తాళం వేసి శనివారం రాత్రి దంపతులు బయటకు వెళ్లారు.

శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ బాలిక పారిపోయే ఉద్దేశంతో భవనం రెండో అంతస్థుపై నుంచి కిందికి దూకింది. వాచ్‌మన్ శబ్దం విని కింద పడి ఉన్న బాలికను చూశాడు. వెంటనే తన గదిలోకి తీసుకుని వెళ్లి ఇతర ఫ్లాట్లలో ఉన్నవారిని లేపాడు. బాలిక కాళ్లకు, చేతులకు గాయాలు తగిలాయి.

బాలిక వాంగ్మూలాన్ని, ఇతర ఫ్లాట్ యజమానుల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. ఆ బాలిక మహబూబ్‌నగర్ జిల్లా హసన్‌పల్లి గ్రామానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. దినసరి కార్మికుల కూతురు ఆమె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+